AP Revenue Education
  • Home
  • Mega Menu
  • Features
  • _Featured Posts
  • _Post ShortCodes
  • __Left Sidebar
  • __Right Sidebar
  • __Full Width
  • _Error Page
  • _Contact us
  • Documentation
  • ShortCodes
  • Download this Template
Type Here to Get Search Results !
Your Responsive Ads code (Google Ads)
HomeGroup-2Satavahana Dynasty MCQs: 130+ AP History Practice Bits for Group 1 & 2 Exams

Satavahana Dynasty MCQs: 130+ AP History Practice Bits for Group 1 & 2 Exams

AP Revenue November 12, 2025 0

Top 130+ Practice Bits (MCQs) on the Satavahana Dynasty: AP History Revision

The Satavahana Dynasty marks a golden chapter in the history of Andhra Pradesh! If you are an aspirant preparing for the APPSC Group-1, Group-2 or any other state-level competitive examinations, mastering this ancient era is half the battle won. Success isn't just about reading theory; it's about executing timed Practice Bits and MCQs to simulate the real exam environment.

AP History exam preparation for Satavahana Dynasty: ancient illustration with modern MCQs from ap-revenue.com practice bits.

We have compiled a special collection of over 130 Frequently Asked Questions (MCQs), complete with accurate answers, covering key aspects like Satavahana administration, social life, economy, religious patronage, and important inscriptions. Use this resource to test your preparation level, identify gaps, and sharpen your knowledge of Ancient Andhra History. Don't wait—begin your successful exam journey now!


ఆంధ్ర చరిత్ర: శాతవాహనుల యుగంపై టాప్ 130+ ప్రాక్టీస్ బిట్స్ (MCQs)

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాతవాహనుల సామ్రాజ్యం (Satavahana Dynasty) ఒక స్వర్ణ అధ్యాయం! మీరు APPSC గ్రూప్-1, గ్రూప్-2 లేదా ఇతర రాష్ట్ర స్థాయి పరీక్షలకు (State Level Competitive Exams) ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైతే, ఈ ప్రాచీన యుగంపై పట్టు సాధించడం మీ విజయంలో సగం భాగం. కేవలం సిద్ధాంతాలు (Theory) చదవడం మాత్రమే కాదు, సమయపాలనతో ప్రాక్టీస్ బిట్స్ (Practice Bits) చేయడం ద్వారానే రియల్-టైమ్ పరీక్షా వాతావరణానికి సిద్ధపడగలుగుతాం.

శాతవాహనుల పరిపాలన, సాంఘిక జీవనం, ఆర్థిక వ్యవస్థ, మతాలు మరియు ముఖ్యమైన శాసనాలపై తరచుగా అడిగే 130 కంటే ఎక్కువ ప్రశ్నలు (MCQs), అవి కూడా ఖచ్చితమైన జవాబులతో కూడిన ఈ ప్రత్యేక సంకలనాన్ని మీ కోసం సిద్ధం చేశాం. మీ ప్రిపరేషన్ స్థాయిని పరీక్షించుకోవడానికి, లోపాలను గుర్తించడానికి మరియు ప్రాచీన ఆంధ్ర చరిత్రపై (Ancient AP History) మీ జ్ఞానాన్ని పదును పెట్టడానికి ఈ అవకాశం వాడుకోండి. ఆలస్యం చేయకుండా, మీ పరీక్షా యాత్రను ఇప్పుడే ప్రారంభించండి!


1. శాతవాహనుల మొట్టమొదటి రాజధాని “శ్రీకాకుళం” ప్రస్తుతం ఈ జిల్లాలో ఉండేది?

  1. శ్రీకాకుళం
  2. కృష్ణా
  3. గుంటూరు
  4. నెల్లూరు

2. ఆంధ్రుల ప్రస్తావన మొట్టమొదటిసారిగా గల ఐతరేయ బ్రాహ్మణం ఈ వేదానికి సంబంధించినది.

  1. ఋగ్వేదం
  2. యజుర్వేదం
  3. అధర్వణవేదం
  4. సామవేదం

3. శాతవాహనుల సామ్రాజ్యంలోని రాష్ట్రాలు

  1. ఆహారాలు
  2. భుక్తులు
  3. తాలూకాలు
  4. మండలాలు

4. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు?

  1. గౌతమీపుత్ర శాతకర్ణి
  2. హాలుడు
  3. సిముఖుడు
  4. శాతకర్ణి-1

5. మత్స్యపురాణం ప్రకారం ఏ శాతవాహన రాజుని “మల్లకర్ణి” అని పేర్కొంది.

  1. మొదటి శాతకర్ణి
  2. రెండవ శాతకర్ణి
  3. కృష్ణుడు
  4. పానగల్లు

6. గుణాడ్యుడు రచించిన 'బృహత్కథ' ఈ భాషలో కలదు.

  1. ప్రాకృతం
  2. సంస్కృతం
  3. పైశాచికం
  4. పాళి

7. భట్టిప్రోలు యొక్క ప్రాచీన నామం?

  1. సారంగపురం
  2. కంటకశిల
  3. మోటుపల్లి
  4. ప్రతిపాలపురం

8. శాతవాహనుల కాలంలో 1/6 వంతు లేదా (18%) పన్ను వసూలు చేసేడివారు. వీరు ప్రధానంగా రోమన్ దేశస్తులతో వర్తక వ్యాపారాలు నిర్వహించేవారు. ఈ కాలంలో అంతర్జాతీయ నౌకా కేంద్రం ఏది?

  1. మచిలీపట్నం
  2. అరికమేడు
  3. బారుకచ్చ
  4. కళ్యాణి

9. యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన నాణేలపై గల ముద్ర ఏది?

  1. చేప
  2. వృషభం
  3. సింహం
  4. నౌక

10. శాతవాహనుల కాలంలో నగరపాలకులను ఈ విధంగా పిలిచేవారు.

  1. శ్రేణులు
  2. మండలాదీశులు
  3. నిగమసభలు
  4. అమాత్యులు

11. శాతవాహనుల కాలం నాటి పట్టణాలను పాలించిన నిగమసభల సభ్యులు?

  1. దూత సిద్దులు
  2. మహారధి
  3. గహపతులు
  4. రజుకలు

12. శాతవాహనుల నాణెం ఏది?

  1. నిష్కటంక
  2. కుశనము, వధకపతక
  3. మాడ, పద్మటంక
  4. మాషకాలు, దీనారాలు

13. శాతవాహనుల కాలంనాటికి చెందిన అజంతా గుహలు ఏవి?

  1. 1, 2 గుహలు
  2. 31, 32 గుహలు
  3. 9, 10 గుహలు
  4. 14, 16 గుహలు

14. మొదటి శాతకర్ణి బిరుదు

  1. దక్షిణ పధేశ్వర
  2. దక్షిణాపథపతి
  3. దక్షిణేశ్వర
  4. దక్షిణాధిపతి

15. త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు ఎవరిది?

  1. యజ్ఞశ్రీ శాతకర్ణి
  2. గౌతమీపుత్ర శాతకర్ణి
  3. మూడో పులోమావి
  4. కుంతల శాతకర్ణి

16. ధూపాడు బౌద్ధక్షేత్రం ఏ జిల్లాలో ఉంది?

  1. గుంటూరు
  2. కృష్ణా
  3. గోదావరి
  4. ప్రకాశం

17. నిగమ సభలోని సభ్యులను ఏమిని పిలుస్తారు ?

  1. గహపతులు
  2. గుల్మికుడు
  3. మిధుకులు
  4. కులరికులు

18. శాతవాహనుల కాలంలో శాశ్వత సైన్యం ఉండే స్థానాన్ని ఏమనేవారు.

  1. స్కందావరం
  2. కటకం
  3. సైనిక శిబిరం
  4. కటి వలయం

19. శాతవాహనుల కాలంలో పరిపాలనలో సలహాలు ఇచ్చుటకు పౌర సభలు ఉన్నాయనే తెలిపే గ్రంథం?

  1. కౌటిల్యుని అర్థశాస్త్రం
  2. బృహత్కథ
  3. గాథాసప్తశతి
  4. లీలావతి కావ్యం

20. మొదటి శాతకర్ణికి సమకాలికుడైన కళింగ రాజు ఎవరు?

  1. ఖారవేలుడు
  2. సిరిపద
  3. అశోకసద
  4. శివమకనద

21. శాతావాహన రాజ్యం ఎక్కువ సంవత్సరములు పాలించిన శాతవాహన రాజు ఎవరు?

  1. మొదటి శాతకర్ణి
  2. రెండవ శాతకర్ణి
  3. యజ్ఞశ్రీ శాతకర్ణి
  4. సుందర శాతకర్ణి

22. శాతవాహన కాలంనాటి నాణేల పేర్లు ఏ శాసనం వల్ల తెలియుచున్నవి?

  1. నానేఘాట్ శాసనం
  2. చినగంజాం శాసనం
  3. రుషభదత్తుని నాసిక్ శాసనం
  4. పులోమావి కార్లే శాసనం

23. అమరావతి స్థూపానికి పూర్ణకుంభ పలకాన్ని సమర్పించిన వారు?

  1. దిమిక
  2. ఉజ్జయినీ యాత్రికుడు
  3. పులోమావి
  4. బోదిసిరి

24. శాతవాహనులు ఎంత శిస్తు వసూలు చేశారు.

  1. 1/4 వ వంతు
  2. 1/8 వ వంతు
  3. 1/6 వ వంతు
  4. 1/3 వ వంతు

25. ఆచార్య నాగార్జునుడు ఎవరి సమకాలినుడు?

  1. గౌతమీపుత్ర శాతకర్ణి
  2. శివశ్రీ శాతకర్ణి
  3. విజయశ్రీ శాతకర్ణి
  4. యజ్ఞశ్రీ శాతకర్ణి

26. శాతవాహనుల సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందిన రేవుపట్టణం ఏది?

  1. బరుకచ్చ
  2. సోపార
  3. కళ్యాణి
  4. చౌల్

27. త్రిసముద్రీశ్వర అనే బిరుదు ఎవరిది?

  1. గౌతమీపుత్ర శాతకర్ణి
  2. నాగార్జునుడు
  3. యజ్ఞశ్రీ శాతకర్ణి
  4. రెండవ శాతకర్ణి

28. ధాన్యకటక మహాచైత్యానికి శిలాప్రాకారాన్ని నిర్మించిన దెవరు?

  1. గౌతమీపుత్ర శాతకర్ణి
  2. నాగార్జునుడు
  3. యజ్ఞశ్రీ శాతకర్ణి
  4. పులోమావి

29. ఒకే ప్రాకారంలో మూడు నాలుగు విహారాలు ఉండి అధ్యయనానికి ఉపయోగిస్తే ఆ నిర్మాణాన్ని ఏమంటారు?

  1. ఆరామం
  2. సంఘారామం
  3. ఘటిక
  4. విహారం

30. హాథిగుంఫా శాసనం ఎవరిని గురించి తెలుపుతుంది?

  1. కుదెపెనసరి
  2. అకోశకసద
  3. ఖారవేలుడు
  4. శివశ్రీ శాతకర్ణి

31. నేత పనివారి శ్రేణి పేరు?

  1. మార్ధకులు
  2. కనకారులు
  3. కోలికులు
  4. కులరికులు

32. సన్నని వస్త్రాలకు ఈ ప్రదేశం ప్రసిద్ధి?

  1. పల్నాడు
  2. పైఠాన్
  3. వైజయంతి
  4. గూడూరు

33. ఆంధ్రులను పేర్కొన్న అశోకుని శిలాశాసనం ఏది?

  1. 6వ శిలాశాసనం
  2. 7వ శిలాశాసనం
  3. 12 శిలాశాసనం
  4. 13వ శిలాశాసనం

34. హాలుని వివాహాన్ని తెలిపే గ్రంథం ఏది?

  1. లీలావతి
  2. గాథాసప్తశతి
  3. గార్గీ సంహిత
  4. బృహత్కథ పరిణయం

35. ఈ క్రింది వానిలో సరిగా జత చేయనిది ఏది?

  1. ఆహారాలు - అమాత్యులు
  2. నిగమాలు - నిగమసభలు
  3. గ్రామం - గ్రామణి
  4. వందనగోష్టులు - పరిపాలనా సభలు

36. స్కంధావారం అంటే ఏమిటి?

  1. పరిపాలనా స్థానం
  2. రాజభవనం
  3. సైనిక స్థావరం
  4. ఉద్యోగుల నివాసం

37. ఈ క్రింది వానిలో సరికానిది ఏది?

  1. కోలికులు - నేతపనివారు
  2. కులరికులు - కుమ్మరులు
  3. వధకులు - వడ్రంగులు
  4. కసకారులు - మేదరివారు

38. సగం ప్రాకృతం, సగం సంస్కృత పదాలున్న శాసనం ఏది?

  1. రుద్రదమనుని గిర్నార్ శాసనం
  2. నహపాణుని జున్నార్ శాసనం
  3. రుషభదత్తుని నాసిక్ శాసనం
  4. దక్షమిత్ర కార్లే శాసనం

39. నాగార్జునకొండ శిథిలాలను మొదట కనుగొన్నదెవరు?

  1. ఎ.ఆర్.సరస్వతి
  2. కల్నల్ మెకంజీ
  3. అలెగ్జాండర్ రే
  4. కన్నింగ్ హోం

40. భట్టిప్రోలు ప్రాచీన నామం ఏది?

  1. కంటకశిల
  2. ప్రతిపాలపురం
  3. ధనదపురం
  4. సారంగపురం

41. పద్మనంది భట్టారకుడు ఎవరి తొలి నామం?

  1. సింహనంది
  2. కొండ కుందనాచార్యుడు
  3. కుండకీర్తి
  4. ధర్మకీర్తి

42. శాతవాహనుల కాలం నాటి ఏకైక రాతి గుహాలయం?

  1. శంఖరం
  2. బొజ్జన్నకొండ
  3. భావికొండ
  4. గుంటుపల్లి

43. వడ్డమాను కొండ ఏ మతానికి చెందినది?

  1. హిందూ
  2. బౌద్ధ
  3. జైన
  4. అజీవక

44. మ్యాకదోని శాసనంలో పేర్కొనబడిన సేనాధిపతి ఎవరు?

  1. స్కందనాగుడు
  2. రెమ్మణక
  3. స్కంద విశాఖుడు
  4. మూడవ పులోమావి

45. ఈ క్రింది వాటిలో హాలుడు రచించిన గ్రంథం?

  1. బృహత్కథ
  2. గాథాసప్తశతి
  3. పంచాష్టికాయం
  4. ఆయనసారం

46. నాగార్జునుడు ఎవరి కుట్ర వలన హత్య చేయబడ్డాడు?

  1. ఆర్యశృంగుడు
  2. విజయశ్రీ
  3. చందశ్రీ
  4. యజ్ఞశ్రీ

47. అభిదమ్మ కోశ రచయిత ఎవరు?

  1. అశ్వఘోషుడు
  2. ఆర్యదేవుడు
  3. బుద్ధపాలితుడు
  4. ధర్మకీర్తి

48. వసుబంధు ఏ గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు?

  1. శతశాస్త్రం
  2. అభిదమ్మ కోశం
  3. చుళ్లమగ్గ
  4. విశుద్ధ మగ్గ

49. టిబెట్ లో కాలచక్ర యానాన్ని ఎవరు ప్రచారం చేశారు?

  1. సిద్ధ నాగార్జునుడు
  2. పద్మసంభవుడు
  3. కుండకీర్తి
  4. వసుబంధు

50. కౌంట్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు?

  1. నాగార్జునుడు
  2. దిగ్నాగుడు
  3. సిద్ధ నాగార్జునుడు
  4. ధర్మకీర్తి

51. శాతవానుల కాలంలో బౌద్ధ విద్యాసంస్థలను ఈ విధంగా పిలిచేవారు?

  1. ఘటికలు
  2. సంఘారామాలు
  3. విశ్వవిద్యాలయాలు
  4. ఆరామాలు

52. శాతవాహనుల కాలం నాటి ద్విభాషా శాసనాలు ఈ ప్రదేశంలో ఉన్నాయి?

  1. మహారాష్ట్ర
  2. కర్ణాటక
  3. ఆంధ్రదేశం
  4. తమిళనాడు

53. శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు ఈ ప్రదేశంలో ఉన్నాయి?

  1. అజంతా
  2. ఎలోరా
  3. అమరావతి
  4. వైజయంతి

54. ఉత్తరశైలి గల ప్రదేశం ?

  1. ధాన్యకటకం
  2. శ్రీపర్వతం
  3. జగ్గయ్యపేట
  4. గుడివాడ

55. పంచాష్టికాయ రచయిత ఎవరు?

  1. సింహనంది
  2. సుహస్థి
  3. పద్మనంది
  4. ధర్మకుడు

56. ఓడ బొమ్మలను లేదా నౌక చిహ్నాలను నాణాలపై ముద్రించిన శాతవాహన రాజు ఎవరు?

  1. మూడో పులోమావి
  2. యజ్ఞశ్రీ శాతకర్ణి
  3. గౌతమీ పుత్రశాతకర్ణి
  4. హాలుడు

57. శాతవాహనుల కాలం నాటి శివలింగం ఎచ్చట వుంది?

  1. గుడిమల్లం
  2. నాగార్జునకొండ
  3. అమరావతి
  4. భట్టిప్రోలు

58. బౌద్ధ వాజ్మయంలో ధాన్యకటకంకు గల పేరు ఏది?

  1. కంటక శైలి
  2. అపర శైలి
  3. పూర్వశైలి
  4. ఉత్తర శైలి

59. నహపాణుడి జోగల్ తంబి నాణేలను తిరిగి ముద్రించిన శాతవాహన రాజు?

  1. యజ్ఞశ్రీ శాతకర్ణి
  2. గౌతమీపుత్ర శాతకర్ణి
  3. మొదటి పులోమావి
  4. రెండో శాతకర్ణి

60. ఈ క్రింది వాటిలో జైనాచార్యుడు కొండా కుందాచార్యుని రచన కానిది?

  1. సమయసారం
  2. ప్రవచనసారం
  3. నియమసారం
  4. సుహృల్లేఖ

61. ఆచార్య నాగార్జునుడు తాను రచించిన ఏ గ్రంథంలో శ్రేయారాజ్య సిద్ధాంతమును ప్రతిపాదించాడు?

  1. రత్నావళి - రాజపరి కథ
  2. సుహృల్లేఖ
  3. ప్రజ్ఞాపారమిత శాస్త్రము
  4. మాధ్యమిక కారిక

62. వీరి కాలం నాటి గుల్మిక పదం దేనిని సూచిస్తుంది?

  1. భూమి సర్వే అధికారి
  2. గ్రామపెద్ద
  3. శ్రేణి అధ్యక్షుడు
  4. కులపెద్ద

63. మత్స్యపురాణం ఏ శాతవాహన రాజును మల్లకర్ణిగా పేర్కొంది?

  1. శ్రీముఖుడు
  2. కన్హ
  3. మొదటి శాతకర్ణి
  4. మొదటి పులోమావి

64. ఆంధ్రాలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం ఎక్కడ కలదు?

  1. భట్టిప్రోలు
  2. అమరావతి
  3. గుంటుపల్లి
  4. ఘంటసాల

65. ఆంధ్రలో లభ్యమయిన మొదటి శాతవాహన శాసనం ఏది?

  1. గుంటుపల్లి శాసనం
  2. భట్టిప్రోలు శాసనం
  3. అమరావతి శాసనం
  4. నాగార్జునకొండ

66. భాండాగారికుడు అనగా ఎవరు?

  1. ద్రవ్యరూప ఆదాయం భద్రపర్చేవాడు
  2. రాజు శాసనాలు భద్రపర్చేవాడు
  3. వస్తు సంచయనమును భద్రపరిచేవాడు
  4. ఆహారాలకు అధిపతులు

67. తిలకమంజరి గ్రంథ రచన ఎవరిది?

  1. బుద్ధస్వామి
  2. ధనపాలుడు
  3. క్షేమేంద్రుడు
  4. నాగార్జునుడు

68. ఆచార్య నాగార్జుని గ్రంథాలన్ని ఏ భాషలో వున్నాయి?

  1. ప్రాకృతం
  2. సంస్కృతం
  3. పైశాచికం
  4. తెలుగు

69. ఈ క్రింది వానిలో ఆచార్య నాగార్జుని రచన కానిది?

  1. సుహృల్లేఖ
  2. ప్రజ్ఞాపారమితి శాస్త్రం
  3. ద్వాదశ నియకశాస్త్రం
  4. సమయసారం

70. శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు?

  1. మొదటి శాతకర్ణి
  2. కృష్ణుడు
  3. శ్రీముఖుడు
  4. రెండో శాతకర్ణి

71. నానాఘాట్ శాసనంలో దక్షిణ పథపతిగా బిరుదు గల శాతవాహన రాజు ఎవరు?

  1. రెండోశాతకర్ణి
  2. మొదటి శాతకర్ణి
  3. హాలుడు
  4. గౌతమీపుత్ర శాతకర్ణి

72. శాతవాహన రాజు హాలుడి బిరుదు ఏమిటి?

  1. అపత్రిహత చక్ర
  2. దక్షిణ పధవతి
  3. త్రిసముద్రాధీశ్వరుడు
  4. కవివత్సలుడు

73. కవివత్సలుడు బిరుదుగల శాతవాహన రాజు?

  1. హాలుడు
  2. యజ్ఞశ్రీ శాతకర్ణి
  3. మొదటి శాతకర్ణి
  4. గౌతమీపుత్ర శాతకర్ణి

74. నానాఘాట్ శాసనము వేయించినది?

  1. గౌతమీ బాలశ్రీ
  2. దేవి నాగానిక
  3. రెండో శాతకర్ణి
  4. కృష్ణుడు

75. నవనగర స్వామి బిరుదుగల రాజు?

  1. యజ్ఞశ్రీ శాతకర్ణి
  2. రెండో పూలోమావి
  3. హాలుడు
  4. గౌతమీపుత్ర శాతకర్ణి

76. శాతవాహనుల కాలం నాటి గృహ చైత్యాలయం?

  1. గుంటుపల్లి
  2. నాగార్జునకొండ
  3. అమరావతి
  4. భట్టిప్రోలు

77. శాతవాహనుల జన్మస్థలం కన్నడ ప్రాంతం అని పేర్కొన్నవారు?

  1. వి.వి. మిరాశి
  2. సుక్తాంకర్
  3. గోపాలాచారి
  4. భండార్కర్

78. శాతవాహనులందరిలో  గొప్పవాడు?

  1. మొదటి శాతకర్ణి
  2. హాలుడు
  3. గౌతమీపుత్ర శాతకర్ణి
  4. యజ్ఞశ్రీ శాతకర్ణి

79. బెణాటక స్వామి బిరుదు గల శాతవాహన రాజు?

  1. యజ్ఞశ్రీ శాతకర్ణి
  2. రెండో పులోమావి
  3. హాలుడు
  4. గౌతమీపుత్ర శాతకర్ణి

80. చివరి శాతవాహన రాజు?

  1. రెండో పులోమావి
  2. మూడో పూలోమావి
  3. యజ్ఞశ్రీ శాతకర్ణి
  4. విజయశ్రీ శాతకర్ణి

81. బౌద్ధాచార్యులు ఉపయోగించిన వస్తువులపై నిర్మించిన స్థూపాలు?

  1. ఉద్దేశిక స్థూపాలు
  2. ధాతుగర్భ స్థూపాలు
  3. పారిభోజక స్థూపాలు
  4. ఆరామాలు

82. శ్వేతగజ జాతక చిత్రం అజంతాలోని ఎన్నవ గుహలో ఈ వర్ణచిత్రం వుంది?

  1. 19 వ గుహ
  2. 13 వ గుహ
  3. 7 వ గుహ
  4. 10 వ గుహ

83. శాతవాహన కాలంలో లోహ పరిశ్రమకు ప్రసిద్ధిచెందిన ప్రాంతం ఏది?

  1. వినుకొండ
  2. పల్నాడు
  3. గూడూరు
  4. నాగార్జునకొండ

84. సువర్ణకారులు అనగా?

  1. సుగంధ ద్రవ్యాల వారు
  2. కంసాలులు
  3. వడ్రంగులు
  4. చర్మకారులు

85. దక్షిణ పథేశ్వరుడు బిరుదు గల శాతవాహన రాజు?

  1. మొదటి పులోమావి
  2. మొదటి శాతకర్ణి
  3. గౌతమీపుత్ర శాతకర్ణి
  4. రెండో పూలోమావి

86. బృహత్కథ గ్రంథంను పైశాచిక భాషలో రచించినది?

  1. గుణాఢ్యుడు
  2. శర్వవర్మ
  3. క్షేమేంద్రుడు
  4. సోమదేవసూరి

87. ఎన్ని కర్షాపణాలు ఒక సువర్ణం అవుతుంది?

  1. 35
  2. 25
  3. 30
  4. 55

88. నిగమ సభలను పేర్కొన్న శాసనం?

  1. గుంటుపల్లి శాసనం
  2. అమరావతి శాసనం
  3. భట్టిప్రోలు శాసనం
  4. నాగార్జునకొండ శాసనం

89. శాతవాహనుల కాలం నాటి కర్షపణాలు అనగా?

  1. బంగారు నాణేలు
  2. వెండి నాణేలు
  3. రాగి నాణేలు
  4. సీసపు నాణెములు

90. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథంను ఏ భాషలో రచించారు?

  1. ప్రాకృతం
  2. పైశాచికం
  3. తెలుగు
  4. సంస్కృతం

91. శాతవాహనుల కాలం నాటి తొలి తెలుగు పదం 'నాగబు' అనే పదం ఏ శాసనంలో బయల్పడింది?

  1. భట్టిప్రోలు
  2. గుంటుపల్లి
  3. నాగార్జునకొండ
  4. అమరావతి

92. సాంచిస్థూపానికి తోరణాలను చెక్కించిన శాతవాహన రాజు?

  1. మొదటి శాతకర్ణి
  2. రెండో పులోమావి
  3. యజ్ఞశ్రీ శాతకర్ణి
  4. గౌతమీపుత్ర శాతకర్ణి

93. ఆచార్య నాగార్జుని కోసం నాగార్జున కొండలో పారావత విహారంను నిర్మించిన శాతవాహన రాజు ఎవరు?

  1. యజ్ఞశ్రీ శాతకర్ణి
  2. గౌతమీపుత్ర శాతకర్ణి
  3. వాసిష్టపుత్ర పులోమావి
  4. రెండో శాతకర్ణి

94. అమరావతి చైత్యానికి గొప్ప ప్రాకారము నిర్మించినది?

  1. యజ్ఞశ్రీ శాతకర్ణి
  2. అశోకుడు
  3. ఆచార్య నాగార్జునుడు
  4. మొదటి పులోమావి

95. శాతవాహనుల మొదటి రాజధాని ఏది?

  1. అమరావతి
  2. మైదవోలు
  3. కోటిలింగాల
  4. శ్రీకాకుళం

96. హాలుడు రచించిన గాధాసప్తశతి ఏ భాషలో రచించబడినది?

  1. పాళి
  2. ప్రాకృతం
  3. సంస్కృతం
  4. దేశీభాష

97. ఆంధ్రులు ఒక జాతిగా మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రస్థావించబడ్డారు?

  1. మత్స్య పురాణం
  2. వాయు పురాణం
  3. ఐతరేయ బ్రాహ్మణం
  4. బ్రహ్మాండ పురాణం

98. ఏ శాసనములను బట్టి బౌద్ధ భిక్షువులు అచ్చట “సింహా గోష్టి”గా ఏర్పడినారు?

  1. భట్టిప్రోలు
  2. నాగార్జునకొండ
  3. గుంటుపల్లి
  4. అమరావతి

99. బౌద్ధులు గాథలను ఏ భాషలో ప్రచారం చేశారు?

  1. ప్రాకృతం
  2. దేశీభాష
  3. పాళి
  4. సంస్కృతం

100. ది గైడ్ టూ జాగ్రఫీ గ్రంధ రచయిత?

  1. మెగస్తనీసు
  2. ప్లీని
  3. ఎరియన్
  4. టాలమీ

101. మత్స్యపురాణం ఏ శాతవాహన రాజుకాలంలో వ్రాయబడింది?

  1. హాలుడు
  2. శ్రీముఖుడు
  3. యజ్ఞశ్రీ
  4. గౌతమీపుత్ర శాతకర్ణి

102. క్షత్రప అనే బిరుదు గల శాతవాహన రాజు ఎవరు?

  1. వాసిష్టపుత్ర పులోమావి
  2. హాలుడు
  3. కుంతలశాతకర్ణి
  4. మొదటిశాతకర్ణి

103. యజ్ఞశ్రీ శాతకర్ణిని రెండు పర్యాయాలు యుద్ధంలో రుద్ర దమనుడు ఓడించినట్లు తెలుపుశాసనం ఏది?

  1. ధరణికోట
  2. గిర్నార్
  3. గుంటుపల్లి
  4. భట్టిప్రోలు

104. శాతవాహనుల కాలం నాటి సార్ధవాహులు అనే పదం దేనిని సూచించును?

  1. వ్యవసాయదారులు
  2. విదేశాలతో వ్యాపారం చేసేవారు
  3. రాజు అంగరక్షకులు
  4. సాలెవారు

105. శాతవాహన శాసనాలలో కనిపించే స్కంధావారం అనగానేమి?

  1. ఆయుధగారం
  2. శ్రేణి నాయకులు
  3. తాత్కాలిక సైనిక శిబిరం
  4. శాశ్వత సైనిక శిబిరం

106. ప్రాకృతంలో గాథసప్తశతిని సంకలనం చేసింది?

  1. శర్వవర్మ
  2. హాలుడు
  3. బాణుడు
  4. గుణాద్యుడు

107. హీనయానానికి ప్రధాన కేంద్రం?

  1. అమరావతి
  2. గుంటుపల్లి
  3. జగ్గయ్యపేట
  4. నాగార్జున కొండ

108. రుద్రదమనుడి కుమార్తె అయిన రుద్ర దమనికను వివాహం చేసుకున్న శాతవాహన రాజు?

  1. రెండవ పులోమావి
  2. యజ్ఞశ్రీ శాతకర్ణి
  3. వాసిష్టీపుత్ర శాతకర్ణి
  4. శివశ్రీశాతకర్ణి

109. శాతవాహనుల కాలం నాటి కురుకర అనగానేమి?

  1. వృత్తిపన్ను
  2. పంటలో రాజుభాగం
  3. యజ్ఞశ్రీ
  4. రెండవ పులోమావి

110. మహామేఘవాహన అను బిరుదు గల కళింగ రాజు?

  1. ఖారవేలుడు
  2. రుద్రదమనుడు
  3. చష్టనుడు
  4. నహపాణుడు

111. పద్మనంది భట్టారకుడు ఏ మతం యొక్క ప్రముఖ ఆచార్యుడు?

  1. బౌద్ధం
  2. వైష్ణవం
  3. శైవము
  4. జైనము

112. భట్టిప్రోలు ప్రాచీన నామం ఏది?

  1. ప్రతిపాలపురం
  2. ధాన్యకటకం
  3. చేబ్రోలు
  4. శ్రీ పర్వతం

113. మాధ్యమిక శాస్త్రం గ్రంధ రచయిత?

  1. భావవివేకుడు
  2. ఆర్యదేవుడు
  3. ఆచార్య నాగార్జునుడు
  4. సింహనంది

114. నాగార్జునాచార్యుడు రచించిన ప్రజ్ఞా పారమిత శాస్త్రము సూచించినది?

  1. పరిపాలన విషయాలు
  2. మత విషయాలు
  3. విజ్ఞానికి సరిహద్దులు
  4. మోక్షానికి మార్గం

115. భారతదేశపు ఐన్స్టీన్, రెండవ బుద్ధుడు అనే పేరు ఉన్న ప్రముఖ బౌద్ధ ఆచార్యుడు?

  1. నాగార్జునుడు
  2. దిజ్ఞానుడు
  3. ఆర్యదేవుడు
  4. కొండకుందాచార్యుడు

116. వాత్సాయనుడు కామసూత్రాలను ఏ భాషలో రచించెను?

  1. సంస్కృతం
  2. ప్రాకృతం
  3. దేశి
  4. తెలుగు

117. శాతవాహనుల కాలం నాటి సప్తగోదావరిని నేడు ఏమని వ్యవహరిస్తున్నారు?

  1. అమరావతి
  2. భట్టిప్రోలు
  3. ఘంటశాల
  4. ద్రాక్షారామం

118. శాతవాహనుల్లో గొప్పవాడు?

  1. మొదటి పులోమావి
  2. రెండవ పులోమావి
  3. రెండవ శాతకర్ణి
  4. గౌతమీపుత్ర శాతకర్ణి

119. శాతవాహన రాజులలో చివరి పాలకుడు?

  1. యజ్ఞశ్రీ శాతకర్ణి
  2. శివశ్రీ శాతకర్ణి
  3. రెండవ పులోమావి
  4. మూడవ పులోమావి

120. శాతవాహనుల కాలం నాటి ప్రసిద్ధిచెందిన జైన ఆచార్యుడు.

  1. ఆర్యదేవుడు
  2. కొండ కుందనాచార్యుడు
  3. ఆచార్య నాగార్జునాచార్యుడు
  4. భావవివేకుడు

121. పద్మనంది భట్టారకుడు అనే పేరు ఏ ప్రముఖ ఆచార్యుని అసలు పేరు?

  1. భావవివేకుడు
  2. ఆర్యదేవుడు
  3. కొండా కుందాచార్యుడు
  4. నాగార్జునాచార్యుడు

122. శాతవాహన యుగంలో గూడూరు దేనికి ప్రసిద్ధి?

  1. లోహ పరిశ్రమ
  2. వజ్ర పరిశ్రమ
  3. సన్నని వస్త్రాలు
  4. నౌక పరిశ్రమ

123. శాతవాహనులలో జైనమతస్తుడిగా పేరుపొందిన రాజు ఎవరు?

  1. శ్రీముఖుడు
  2. మొదటి శాతకర్ణి
  3. మొదటి పులోమావి
  4. హాలుడు

124. హాలుని వివాహాన్ని తెలిపే గ్రంథం ఏది?

  1. లీలావతి కావ్యం
  2. గాధసప్తశతి
  3. కథాసరిత్సాగరం
  4. బృహత్కధ

125. శాతవాహన కాలంలో పలనాడు దేనికి ప్రసిద్ధి?

  1. లోహ పరిశ్రమ
  2. వజ్రాల పరిశ్రమ
  3. సుగంధ ద్రవ్యాలు
  4. సన్నని వస్త్రాలు

126. బౌద్ధ భిక్షువులకు నానాఘాట్ గుహను దానం చేసినవారు?

  1. గౌతమీ బాలశ్రీ
  2. నాగానిక
  3. రుద్రదమనిక
  4. రుద్ర భట్టారిక

127. గౌతమీ బాలశ్రీ బదయనిభ బౌద్ధశాఖకు దానం చేసిన గుహ?

  1. నాసిక్
  2. గుంటుపల్లి
  3. నానాఘాట్
  4. కార్లే

128. అమరావతి మహాస్తూపానికి గొప్ప ప్రాకారం నిర్మించిన వారు?

  1. యజ్ఞ శ్రీ శాతకర్ణి
  2. ఆచార్య నాగార్జునుడు
  3. గౌతమీ పుత్రశాతకర్ణి
  4. రెండవ శాతకర్ణి

129. శాతవాహనులు తమ శాసనాలను ఏ భాషలో వ్రాయించారు?

  1. సంస్కృతం
  2. ప్రాకృతం
  3. తెలుగు
  4. బ్రహ్మీ

130. “గుల్మిక” పదంను పేర్కొన్న శాసనం ఏది?

  1. మంచికల్లు
  2. మ్యాకదోని
  3. అమరావతి
  4. నాగార్జునకొండ

జతపరుచుము (Match the Following)

131. గ్రంథాలు మరియు రచయితలు

గ్రంథం

రచయిత

1) బుద్ధ చరిత్ర

ఎ) నాగసేనుడు

2) సూత్రాలంకార

బి) అశ్వఘోషుడు

3) మిళిందపన్హా

సి) నాగార్జునుడు

4) మాధ్యమిక కారిక

డి) అసంగుడు

  1. 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
  2. 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
  3. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
  4. 1-బి, 2-డి, 3-ఎ, 4-సి

132. శాసనాలు మరియు వాటికి సంబంధించినవారు

శాసనం

సంబంధిత వ్యక్తి

1) నానాఘాట్ శాసనం

ఎ) శకరాజు, రుద్రదమనుడు

2) నాసిక్ శాసనం

బి) శాతవాహన రాణి, నాగానిక

3) జునాగఢ్ శాసనం

సి) ఖారవేలుడు

4) హాథిగుంఫా శాసనం

డి) బాలశ్రీ

  1. 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
  2. 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
  3. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
  4. 1-బి, 2-డి, 3-ఎ, 4-సి


Congratulations on successfully completing this exhaustive compilation of Satavahana Dynasty practice bits! 👏 By reviewing the correct answers for each question, you have successfully assessed your grasp over one of the most critical topics in Andhra Pradesh History.

Knowledge is a continuous quest! Do not give up your perseverance until your Government Job Dream is realized. For more in-depth study material, MCQs on other subjects, and comprehensive exam analysis that leads to success, be sure to explore our vast library of resources on our website: ap-revenue.com.

Wishing you all the very best for a fruitful and successful preparation!

All the Best!


ఈ శాతవాహనుల యుగం ప్రాక్టీస్ బిట్స్ సంకలనాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు! 👏 ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఈ అంశంపై మీకు ఎంత పట్టు ఉందో మీరే అంచనా వేసుకోగలిగారు.

జ్ఞానం అనేది నిరంతర అన్వేషణ! మీ ప్రభుత్వ ఉద్యోగ కల (Government Job Dream) సాకారం అయ్యే వరకు మీ పట్టుదలను వదలకండి. మరింత లోతైన మెటీరియల్ (In-depth Material), ఇతర సబ్జెక్టుల MCQs మరియు సమగ్ర పరీక్షా విశ్లేషణ కోసం, మా అపారమైన వనరుల లైబ్రరీని అన్వేషించడానికి తప్పకుండా మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: ap-revenue.com.

మీ ప్రిపరేషన్ విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

All the Best!

Tags
AP History Bit Bank Group-1 Group-2
  • Newer

    Satavahana Dynasty MCQs: 130+ AP History Practice Bits for Group 1 & 2 Exams

  • Older

    Satavahana Dynasty MCQs: 130+ AP History Practice Bits for Group 1 & 2 Exams

You may like these posts

Post a Comment

0 Comments

Top Post Ad

Top Post Responsive Ads code (Google Ads)

Bottom Post Ad

Below Post Responsive Ads code (Google Ads)

Show ad in Posts/Pages

Your Responsive Ads code (Google Ads)

Professional Jobs

  • Lecture Jobs
  • Competitive Exams
  • UPSC Exams
  • NEET Exams
  • Arts Passed Jobs
  • Computer Science
  • Electrical Jobs
  • Mechanical Jobs
  • Civil Jobs
  • Scholarship Data
  • School teachers TGT
  • Intermediate Candidates
  • Qualifications of PhD
  • Engineering Jobs
  • Degree Holder Jobs
  • Bsc Paased Data

Popular Jobs

Satavahana Dynasty MCQs: 130+ AP History Practice Bits for Group 1 & 2 ExamsNovember 12, 2025

News

Your Responsive Ads Code (Google Ads)

Social Plugin

Sidebar Posts

6/box-posts/recent

Qualification Wise

  • Best Jobs Engg
  • Civil Jobs Part
  • Engg Jobs Part
  • Private Jobs
  • Teacher Jobs Test
  • 8th Passed Jobs
  • Airforce Jobs
  • Indian Navy Jobs
  • Army Jobs
  • Electrical Jobs
  • 12th passed Jobs
  • 10th Passed Jobs
  • State Govt Jobs
  • All State Jobs

Categories

  • AP History 1
  • Bit Bank 1
  • Group-1 1
  • Group-2 1

Report Abuse

Search This Blog

  • November 20251

Col left

5/col-left/recent

Ads

Your Responsive Ads code (Google Ads)
AP Revenue Education

About Us

we are committed to being your trusted partner in your competitive exam journey. Your questions, feedback, and suggestions are invaluable to us as we strive to improve and provide the best possible resources for Andhra Pradesh Revenue Department and other government exam aspirants.

Follow Us

  • Home
  • About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Conditions

Footer Copyright

All Right Reserved Copyright © ap-revenue.com

Contact Form